పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మే 2014, శుక్రవారం

Sai Padma కవిత

Sai Padma//.................................... ఒక్కోరోజు జీవితానికి పెడమొహం గా ఉండాలని అనిపిస్తుంది ప్రవాహాన్ని లో కొట్టుకొనే సుఖం అనుభవించాలని అనిపిస్తుంది రాముడిని మలచిన సీత కైనా , నిగ్రహానికి నీళ్ళోదలలాలని నిజాన్ని నిలువునా నిగ్గదియ్యాలని అనిపిస్తింది ఒక్కో గడియ ప్రేమించాలని అనిపిస్తుంది కాస్త ఎక్కువైనప్పటికీ, శృతి మించాలని అనిపిస్తుంది వేదన నిండిన క్షణాల్ని , తృణీకరించి అమ్మ వొడిలో నిండిన సీతలా , భూగర్భంలో ఎగరాలనిపిస్తుంది వొక్కో క్షణం జీవించాలని అనిపిస్తుంది దండకారణ్యాల దారుల్లో , బంగరు లేళ్ళ మోహంలో ప్రాయిపవేశం అడగని ఆత్మీయతల్లో అయోనిజ లో నిజంలా, అచ్చమైన జానకిలా బ్రతకాలనిపిస్తుంది ఒక్కోసారి ప్రశ్నించాలని అనిపిస్తుంది ఆడతనం పేరుతో, సున్నితత్వంలో నెట్టేసిన దృఢత్వాన్ని మళ్ళీ మళ్ళీ , మళ్ళీ మళ్ళీ , మళ్ళీ మళ్ళీ ధ్రువీకరించాలని అనిపిస్తుంది ..!! --సాయి పద్మ ( ఎప్పుడో సీత గురించి రాసుకున్న పద్యం.. ఇప్పుడు సీతని ఆవాహన చేసుకొన్న వాళ్ళ కోసం )

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RvtJkC

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి