మనిషితత్వం మారాకై చిగురించాలి ******************************** చెట్టు మారాకు వేసినట్లు కొత్తచివుర్లను తొడుక్కుని పచ్చదనాన్ని నింపుకుని మెండుగా ..కడు నిండుగా మనిషితత్వం మారాకై చిగురించాలి రాలిపోయిన పండుటాకులను గడిచిపోయిన రుతువులో దాచేసి సుడులురేపిన చేదు జ్ఞాపకాలను కరిగిపోయిన కాలంలో కలిపేసి మనిషితత్వం మారాకై చిగురించాలి గతాన్ని తలచుకుని పరాకు చెందక వెతలను ఏకరువుపెట్టి చిరాకు పడక గ్రీష్మాన్ని చిగురు నవ్వుతో అనుభవిస్తూ వసంతాగమనాన్ని ఆహ్వానిస్తూ మనిషితత్వం మారాకై చిగురించాలి మొగ్గ తొడగడం, పూలు పూయడం మారాకు వేయడం .. మనుషులమూ అలవర్చుకోవాలి మనిషితత్వం మారాకై చిగురించాలి
by Obul Reddy Tavva
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1leqs6m
Posted by Katta
by Obul Reddy Tavva
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1leqs6m
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి