:నవ్వలేను: - నాగారం డి ప్రకాశ్ పువ్వుగా పూసిన నవ్వు నవ్వుగా నవ్విన పువ్వు ఆరోగ్యకరం నవ్వు ఆనందకరం పువ్వు పువ్వులో మకరందం ఉంది నవ్వులో అందం ఉంది పువ్వు పులకరింపు నవ్వు పలకరింపు నెరజాణ సిగలో పువ్వు వెకిలి నవ్వు దైవం పాదాలపై పువ్వు ఆహ్వానపు నవ్వు ఆస్వాదించే తుమ్మెద కోసం పువ్వు స్పందించే ఎద కోసం నవ్వు పెదాలరెమ్మలతో పూసిన నవ్వు మనిషికి అందం రేకులు విప్పిన పువ్వు మనసుకు బందం పువ్వులేని ప్రకృతిలా నవ్వలేని మనిషి మానసిక రోగి తనకోసం నవ్వనివాడిలా వికసించిన పువ్వొక త్యాగి పువ్వు చాటు ముళ్ళు ఎన్నో నవ్వు చాటు కుళ్ళుఎన్నో దాచినది దోచుకొమ్మని పువ్వు దాచలేనిది దాచాలని నవ్వు సముద్రమంత దు:ఖాన్ని మింగిన నోట నవ్వు రాదు మకరంద మంతా తుమ్మెదకివ్వకుంటే అది పువ్వు కాదు పురుగుపట్టి పుచ్చిన చోట పువ్వు రాదు నిరాశతో మనసు చచ్చిన పూట నవ్వు రాదు - నాగారం డి ప్రకాశ్ 6848865350 18-04-2014
by Nagaram Dprakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9RW51
Posted by Katta
by Nagaram Dprakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9RW51
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి