లక్ష్మణ్ స్వామి || వేదన లేని వేకువవేపు... || గాజు అద్దాలని చీల్చుకుని బయటకు వస్తున్న భాష్పాలు....!! చీకటి కొండల మధ్య చీల్చ బడ్డ వెన్నెల! దారిపొడుగునా అస్థికలు , విభూధి ! నెత్తుటి చారికలంటిన పుస్తకం ...!! గాలి మోసుకొస్తున్న ఆర్తనాదాల కమురు వాసన !! తలతెగిన శ్వేత కపోతాన్ని పీక్కుతింటున్న తోడేలు !! చెత్తకుప్పలో తడిఆరని పసి తలని తింటూ వరాహం !!!! కోరికలు తీర్చుకునే కోడెనాగుల కొత్తపదం పేరు ప్రేమ !! నేలను బద్దలుకొట్టుకుని బయటకొస్తున్న పిశాచ వృక్షాలు ! ఎడతెగని రావణ కాష్టంలో కురుస్తున్న రాజకీయ ఇంధనం !! ద్విముఖ చంద్రహాసానికి విషాన్నద్దుతూ నేను .....! చీకటిని మూటకట్టి ఏ అగ్నిగుండంలో వేసే పోరాట ఆరాట తపన !! ఓరి దేవుడా ఒకే ఒక్కరోజు నీ శక్తినిచ్చి చూడు!! యుగాలకావల ఈ దగాకోరుల్ని ఈడ్చి పడేస్తా !!! -------------------------- 18 – 04 – 14
by Laxman Swamy Simhachalam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdEyxO
Posted by Katta
by Laxman Swamy Simhachalam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdEyxO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి