పేరు మరిచిపోయి.. కష్టమే నిన్ను అర్థం చేసుకునుడు వాగర్థాలు వేరుపడ్డప్పుడు భాష వుండదాయె నన్ను గుర్తుపట్టలేనంత కంటిపూలు పూసినపుడు నువ్వయినా ఏంచేస్తవులే ప్రతిరాత్రిని జల్లెడాడిస్తే చుక్కలే పున్నమి నెలకొక్కసారే పగలయినా రాత్రయినా ఏసిలో కన్నీళ్ళు ఆరయి వగపయినా వలపయినా ఇష్టమైన మనిషి కొరకేకదా మారిపోయే రుతువులు మనిషికి సంతోషాల్ని రిజర్వ్ చేస్తాయా దారినపోయే నేస్తాలు మనవనుకుంటే దుఃఖాలు మత్తడి దూకుతయిర మాటలందరు మాట్లాడుతరు నరందాయె నాలుక అన్ని యాదికి పెట్టుకుని బతికిందెవరు? చల్నేదో బాలకిషన్ అంతా గింతే నువ్వటు నేనిటు నడుమ తొవ్వ పడిగిప్పిన తాసులెక్క భ్రమలు కాకపోతే వూకనే ఎవరెందుకు యాదికిజేస్తరు తండ్లాట కాకపోతే యాదికొచ్చినపుడల్లా మనసెందుకు పచ్చిగయితది ఎర్రటెండల్ల గూడ ఎండనివాగులు కండ్లేనాయె మాటలంటంగని గుండెపుండు మానదు అంత్రాల మీద అంత్రాలు కడుతం గని ఆయింత మనుషులే లేకపోతే ఏం జేసుకుంటం అలసటలేకుంట ఏరుకుంటపోతం గని ఎవలు మిగులుతరని ఆశుండాలె గని ఏన్నో ఆగకపోతే ఆగం కద గరిసెలు నిండాలంటె పొలమే పండాలె ఖాయిషి తీరాలంటె మనసు పచ్చగుండాలె నుమాయిష్ కాదు బతుకుడు సమాజ్దారిగ కాలం గడుపుడు
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5g9yK
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5g9yK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి