_ఒకసారి_ ముందడుగోటేసాక పయనమంతా అడుగులే ఎవ్వరిదైనా ఎన్ని కాళ్ళు కలిసినా విడిపోయినా !! నడకే గమ్యమైతే నడిపించే గమ్యమేది?? రెండూ ఒకటేగా..రెండుండవ్ మరి!! ఒకటే రెండైనట్టున్న దారిలో దారంతా గమ్యంగా ఉంటే గమ్యం మూడైనట్టుంది దారితో కలిపి ఒకటి రెండవగా లేనిది మూడైతే ఏంటి , ఎన్నైతే ఏంటి అసలొకటంటూ లేకుంటే నడకే లేదుగా!! గమ్యమొకటే అనుకోకుంటే అగమ్యం అవుతుందా , గమ్యం అనంతమవుతుందా!! రక్తం తిరుగుతూ ఒంట్లో నిలిచే ప్రాణం స్థిరంగా లోకాన్ని గమ్యం చేసుకోలేని దారుల్లో అగమ్యంగా సాగే నడకదేగమ్యమో!! ధర్మాలడ్డుపడితే దులిపేస్కోవచ్చు దారులడ్డుపడితే కలిపేస్కోవచ్చు అనంతం అడ్డంకిలా కనిపిస్తే అగమ్యాన్ని చేరినట్టేగా కానీ నడకాగదే సోదిలోది!! ఒకసారి భౌతికవాదిగా ముద్రేసుకుంటే ఇక గమ్యానికి అర్థం లేకపోయినా నడక్కి అర్థం దొరుకుతుందేమో లౌక్యంలో ఐక్యమయిపోతేనే అనంతం అంతమయ్యి గమ్యమొకటుండేలా చేస్కోచ్చేమో అయినా చావుకు లేని చిక్కులు బతుక్కెoదుకో సొల్లులోది!! కళ్ళు తెరిస్తే కనిపిస్తున్న కల్లోకంలో బతికి చావడమే నిద్రేపోని గమ్యంలా ఉంది ఈ మాత్రం నిజాన్ని జీర్ణించుకోలేని జీవెందుకు?? జన్మ దండగ భూమిలోది!!______(18/4/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9RYtv
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9RYtv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి