పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మార్చి 2014, సోమవారం

Usha Rani K కవిత

మరువం ఉష | పగులు వారిన అద్దం ----------------------------------- నేలకి తగిలిన కవుకు దెబ్బలు పూలని విసిరికొట్టిన కొమ్మలకి కనపడవేమో నీడలు నల్లనెత్తుటి చారికలని గుర్తుకు తెస్తున్నాయి ఖాళీ పడక్కుర్చీ నిట్టూర్పులు మనసు ఒలకబోసి వెళ్ళిన మనిషికి వినపడవేమో నలిగిన మెత్తలు మురిగిన కన్నీటిని మోస్తున్నాయి దూరమైపోతున్న నిన్నమొన్నలు రెప్పల గంటలు కొట్టి రేపుని ఆహ్వానించే కంటికి తెలియవేమో గతం హడావుడిగా అరలు సర్దుకుంటుంది బీరువా తలుపు తీయగానే చేజారిపడే తాళాల గుత్తిలా ఈ ఒక్కసారికీ నిశ్శబ్దం గళ్ళుమంటే బావుణ్ణు పగులు వారిన అద్దం ఉంటేనే తెలియని ప్రతిబింబాలు గోచరిస్తాయి 17/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mcomTT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి