పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మార్చి 2014, సోమవారం

Kotha Anil Kumar కవిత

( స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపధ్యం లో విడుదల అయిన పుస్తకం "ధిక్కార" లో నా కవిత ) @ మగ మృగం @ అడవి మృగాల పోటీలో పాల్గొన్నడొక పురుషుడు జాతి తత్వాన్ని భగ్నం చేస్తూ... పశువు కన్నా మెరుగైన ప్రతిభ చాటుకున్నాడు. వికృత చేష్టలతో సహా పోటిదారులకు విస్మయం కలుగ చేస్తున్నాడు విచిత్ర వేషాలతో వనలోకానికి సైతం విలువను నిర్జీవం చేశాడు కలబడడంలో ఖడ్గమృగాన్ని ఎగబడడంలో వనవరహాన్ని మించిపోయి తనదైన శైలిని ప్రదర్శించాడు పీక్కుతినే తోడేళ్ళు...గుంటనక్కలు వెంటాడే చిరుతలు...బలిసిన భల్లూకాలు వీడి వికృత క్రీడాస్పూర్తికి తట్టుకోలేక నివ్వెర పోయాయి కాళనాగుల కాళకూట విషమైనా... వ్రుశ్చికపు కర్కోటక గరలమైనా... ఇతడి విష చూపుల ముందు నీరుగారి పోతాయి. మదపుటేనుగుల మదబలం ఊరకుక్కల వెర్రితనం వీడి మృగవాంచ ముందు చిన్నబోయాయి జంతులోకానికి ఇంతటి పోటీనిచ్చే కరుణరహిత కాటిన్య మృగమెక్కడి దనుకుంటున్నారా మనిషిల కనిపించే పశువు గాదు వీడు. చిత్తం లేక రామించితే జనించిన విషపూరిత మనవమృగం కామ వాంచతో తన తోటి మనవజాతిలోని మగువలను కబలించి చంపే కామందమృగం జనంలో సంచరిస్తూ జంతువుల మారి వనితలపై విరుచుకుపడే జనారణ్య మృగం మగజాతి లోకంలోకి తెలియక దేవుడు విసిరి పారేసిన కర్కశ మగమృగం. _ కొత్త అనిల్ కుమార్ . ఆవిష్కరణ _ 16-3-2014 మేడ్చల్

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBQdd0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి