పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మార్చి 2014, సోమవారం

Girija Nookala కవిత

మీమాంస నాలో నేను నాకై నేను నాతో నేను నేనే నేను నీకై నీతో తోడై రారు నీదీ నీకే నువ్వు నువ్వే ఏక వచనం ఏక్ నిరంజన్ తక్కినదంతా సుధీర్ఘ స్వప్నం మెలుకవ వస్తే అనంత లోకం బ్రహ్మాండం లో నీదొక కణము కణమై వచ్చి మనిషిగ ఎదిగి జగమై తలచి తెలివే తానని అంతా నేను అన్ని నేనని అనుకొని భ్రమపడి మనసుతొ కలబడి ఆశల ఊపిరి కాంక్షల కావడి చివరికి కాలం విరామ చిహ్నం అసలు "నేను" అనే బ్రహ్మ పదార్ధం ఉన్నట్టా లేన్నట్టా? 17-2-2014

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cPyA9t

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి