పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మార్చి 2014, సోమవారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || గతి తప్పిన జీవితాలు || ============================= వెక్కిరింతల శాపాల నడుమ దేహాలు ఆకలి కోసం నగ్న ఉదరాలై మాడిపోతూ- వాడిపోతున్నాయి ఆకలి బతుకుల మధ్య మెతుకుల కోసం వెతుకులాటలో అతుకుల బతుకుల పోరాటం చేస్తున్నాయి పరిగెట్టే పాదాల కింద నలిగిపోతున్న విచిత్ర జీవితాలు ఎంగిలి మెతుకుల కోసం చెత్త కుప్పలను ఆశ్రయిస్తున్నాయి విసిరేసిన జీవితాలు ఎంగిలివిస్తర్ల కోసం పరితపిస్తున్నాయి ఉదయాన్నే ఆకలి పేగు శబ్దం గుండె చప్పుడును పరిగెట్టిస్తుంది దేహి.. దేహి అంటూ దైన్యం గా దగా పడుతూ యాచిస్తున్నాయి హస్తాలు ముడుచుకుని, పేగు వడి పెట్టుకుని బిచ్చమెత్తుకుంటున్నాయి కళ్ళల్లో దైన్యం,కాళ్ళల్లో అధైర్యంతో జీవితాన్ని రోలర్లా తిప్పుతున్నాయి గతి తప్పిన మనసుతో మనిషిలా బతుకుఆశ కోసం ఆరాట పడుతున్నాయి రక్త ఛారలు లేని కళ్ళతో కనురెప్పలను బలంగా మూసుకుంటూ తెల్లారే జీవితం కోసం చిన్నగా కునుకు లాగేస్తున్నాయి ఎన్నాలైన తెల్లారని జీవితాలు నిత్యం చీకటినే చూస్తున్నాయి సూర్యోదయం కూడా బాహ్య వెలుగు నిచ్చి జీవితానికి చిమ్మ చీకటిని కప్పేస్తుంది గూడు లేని ప్లాట్ ఫాం జీవితాలు గమ్యం లేని పయనంలో గాలి జీవితాలై అలసి పోతూ శూన్యం లో కలిసిపోతున్నాయి అమరికల బతుకుల మధ్య ఊపిరి నిలబెట్టుకోవడం ఎంత కష్టం! ============== మార్చి 17/2014 -------------------

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p2huW0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి