డా. రావి రంగారావు (ఆవులు కనిపించే దేవతలు) పదిహేను ఆవుల్ని ఒక్కసారే ఎలా చంపారురా... ఆవు మాంసం కంటే అమ్ముకోటానికి ఇంకేదీ దొరకలేదా... ఆవంటే ఒక అమ్మ గుర్తుకు రావాలి ఆవంటే ఒక పచ్చని పండ్ల చెట్టు గుర్తుకు రావాలి ఆవంటే ఒక నడుస్తున్న నది... ఆవంటే ఒక పండుతున్న పొలం... అమ్మను చంపుకుంటాడా ఎవడైనా పచ్చి మాంసం అమ్ముకోవటం కోసం! పండ్ల చెట్టును నిలువునా నరుకుతాడా ఎవడైనా కట్టెలు మార్కెటులో సొమ్ము చేసుకోవటం కోసం! నది లేకపోతే నీవెలా బతుకుతావు! పొలం లేకపోతే నీవెలా నీ కుటుంబాన్ని పోషిస్తావు! ఆవు హిందువుల ఆరాధ్య దేవతని కాదు- ఒక మతానికి చెందిన పవిత్ర జంతువని కాదు- ఎలాంటి తప్పుడు కళ్ళజోళ్ళు లేకుండా చూడు, ఎలాంటి చెప్పుడు మాటల పుళ్ళు మనసులో లేకుండా ఆలోచించు... ఒక్క ఆవు ఉచ్చతో, పేడతో ఎలాంటి ఇతర ఎరువులు లేకుండా పదెకరాలు పండించవచ్చు... ఏటా వంద మంది మనుషుల్ని పోషించవచ్చు... కొన్ని ఓల్టుల విద్యుత్తు సృజించవచ్చు... కొన్ని వేల బాక్టీరియాల్నిధ్వంసించవచ్చు... కుటుంబ మంటే భార్య, పిల్లలు మాత్రమే కాదు- ఒక అవును పెంచినప్పుడే పరిపూర్ణ కుటుంబం... పెళ్ళాం బిడ్డల్ని చంపుకుంటే ఒక కుటుంబమే పోతుంది, ఒక ఆవును చంపితే కొన్ని కుటుంబాలు పోతాయి... ఆవును ధర్మం అని సత్యం అని ఎందుకన్నారో తెలుసురా మీకు! ఆవు లంటే మానవులను పోషించే అసలైన తల్లులు, ఆవు లంటే మనల్ని పాలిస్తూ కనిపించే దేవతలు. ( విజయనగరంలో పదిహేను ఆవుల్ని మాంసం కోసం చంపారన్న వార్త ఇప్పుడే టీవీలో చూసి...) 17-03-2014 5.59 PM
by Ravi Rangarao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBQdda
Posted by Katta
by Ravi Rangarao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBQdda
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి