ఆర్కే||హోలి రంగులు|| హోలి పుణ్యాన వళ్ళంత రంగులద్దుకొని అసలురంగు //దాచుకునే //ప్రయత్నం // ఈ ఒక్కరోజైన//! వర్ణహీనమో వర్ణరహితమో మాసిపోయిన మనసులు రంగువెలసిన మనుషులు చవుకైన రంగులద్దుకొని చులకనైన జీవితం ప్రక్షాళనకోసం పరిగెడితే చుట్టూత మూసినదే మురికి నీటిలో మనసు తేలి ఆడుతోంది..మలినపు బుడగలా విచిత్రం ఆ బుడగాలోను సప్తవర్ణాల ప్రతిబింబమే ...ఓ నిజమైన అబద్ధంలా బ్రిడ్జిపైనుండి ఏ రంగులేని నగ్నదేహంతో ఓ పసిబిచ్చగాడు మురికిప్రవాహంలో రంగుల బుడగే ప్రపంచమన్నట్టు రంగుల బుడగను చూసి మురిసిపోతున్నాడు కొద్ది క్షణాలే మురిపెం ఈ జీవితపు ఆటలో ..ఆటైన, రంగైన టపెల్..తుస్స్ ...పేలిన బుడగలో రంగులు విరజిమ్మలేదు,కాని ఆశపడ్డకళ్ళలో ఎర్రని కన్నీరు పరవళ్ళు తొక్కుతూ వెనుదిరిగి నగ్నంగా నడుస్తున్నాడు బిచ్చమెత్తుకుంటూ రక్తంఅంటని అమ్మకడుపులో పసి పిండంలా స్వచ్చమైన రంగులతో! ఆర్కే||హోలి రంగులు|| 20140317
by Rajkumar Bunga
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKhc1i
Posted by Katta
by Rajkumar Bunga
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKhc1i
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి