మృత్యువు..//@ajay నాతోపాటే ..ఓ ఆత్మీయ మిత్రుడు పుట్టాడు.. క్షణకాలమే మా స్నేహబంధం.. పలుకరింపైనా లేకుండానే అదృశ్యమయ్యాడు.. ఏంటో చాలా మంచివాడు.. ఎటెల్లిపోయాడో.. ? ఎందుకు విడిచి వెళ్లాడో..? ఐనా..నిత్యం వెన్నంటి ఉన్నాడన్న భావనే.. గుండెచప్పుడు మందగించినప్పుడల్లా.. అయ్యో నేస్తం అన్న తన ఆవేదన విన్నట్టుగానే ఉంది.. తన అడుగుల చప్పుడు మనసుకు తెలుస్తూనే ఉంది.. తనకి కూడా సేమ్ ఫీలింగ్ అనుకుంటా.. అనునిత్యం నన్ను కలుసుకునేందుకు తపనే .. ఆపద ఎదురైన ప్రతీక్షణం.. అక్కున చేర్చుకొనేందుకు ఆరాటమే.. ఐనా.. ఎందుకో తెగ మొహమాటం వాడికి.. ఇప్పటికైతే ఎదురుపడలేదు.. కానీ..ఏనాటికైనా కలువకపోడుగా.. గట్టిగా నిలదీసేస్తా.. ఏంట్రా .. ఇన్నాళ్లకు తీరిందా అని... బదులేమిస్తాడో చూస్తా... అప్పుడు మీమీద్దరమేగా.. ఇన్నాళ్ల ఊసులన్నీ తీరిగ్గా ముచ్చటించుకుంటాం
by Ajay Kumar Kodam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ogKzi2
Posted by Katta
by Ajay Kumar Kodam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ogKzi2
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి