పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మార్చి 2014, శనివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరినీ169-175// 169. ప్రజలకి సామాజిక న్యాయం చేస్తానన్నది నేనే కులం ఓట్లు చూపి సియం పదవి కోరుతున్నది నేనే ప్రజల నమ్మకాన్నీ పార్టీనీ అమ్ముకున్న వ్యాపారి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ....25.02.2014. 170. అమ్మనీ ఆడపడుచునీ గౌరవించింది నేనే ఆలికేమీ తెలియదని అవమానించిది నేనే అంతిమంగా ఒంటరయ్యేది అంధసంసారి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 171. సాగినంత కాలం ఏలుబడిలో నేనే సాగక పంతాలు ఆడిపోసుకునేదీ నేనే సాగరానికైనా తప్పనిది ఆట పోటు ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ. 172. అనుక్షణం తత్వచింతనలో నేనే అప్పుడప్పుడూ అందరినీ విమరిస్తూ నేనే అంతరాన్ని పలక అర్హుడు కవి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 173. ఏర్పడ్డ తెలంగాణ నేనే విడగొట్టబడ్ద ఆంధ్రప్రదేశ్ నేనే మూడుప్రాంతాల దోచుకోబడ్డ బడుగుజీవి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 174. ఎగువ ప్రాంతాలకు చుక్క దక్కని గోదారి నేనే దిగువ ప్రాంతాలను ముంచే వరద గోదారి నేనే అంతిమంగా ఆలింగనం చేసుకునే సముద్రుడు ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 175. కాలంతో పోటీ అంటూ శపధాలు చేసి నేనే శుభమహూర్తం కోసం కాలయాపన చేస్తూ నేనే మంచి పనికి మహూర్తం తక్షణం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ....01.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJ39YO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి