నరేష్కుమార్ \\పురాతన ప్రయాణం\\ దేహాత్మల్లోంచి విడివడి వొడివాడి చిక్కిపోయిన మనసుతో చలిస్తూ చరిస్తోన్న రైలు నన్ను మోసుకుంటూ.... కదుల్తోంటాను నేనూ చలించని పాదపు ప్రయాణంలో చరిస్తూ... కొన్ని చెట్లనూ కొన్ని ద్రృశ్యాలనూ వొరుసుకుంటూ వెల్తోన్న రైలు వొకానొక సరస్సుపక్కగా వెల్తూ తనని తాను చూస్కుంటుంది నీటి అద్దంలో అచ్చం. నాలా ఉంటుంది రైలు ఓపెన్ సెసేం మంత్రం గుర్తున్నా తెరువబ్డ్డ ద్వారం దారివ్వదు... మళ్ళీ మళ్ళీ కొన్ని దృశ్యాలు కిటికీలోంచి తిరిగి తిరిగి చూస్తూంటాయ్ రైలొక నదిని దాటుతూన్నప్పుడు కొన్ని నాణేలకు బదులుగా రెండు నిర్వేదపు నిట్టూర్పులని తీసుకుంటుంది... ఒక్కోక్కసారి ప్రయాణం ఓ అర్థరాత్రిని చీల్చుతున్నప్పుడు స్వప్నస్ఖలనం లా జారి ముందు రాలిపడతాడొకడు దారివ్వలేని తెరుచుకున్న ద్వారం దగ్గిర అగ్గిపెట్టె రెండు మనసులనీ వెలిగించాక అతనడుగుతాడు.. "ఎక్కడిదాకా...?" సిగరెట్టు ఙ్ఞాపకాన్ని కొనవేలితో విదిలిస్తూ.. "బయల్దేరిన చోటికె !" బదులిస్తాన్నేను 01/02/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKJxN3
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKJxN3
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి