Meraj Fathima \\ఆరోజు వస్తుంది\\ గుడిసె కూలిపోయింది చట్టాల పరిదిలో, బ్రతుకు కొట్టుకు పోతుంది కష్టాల వరదలో, కాపురం తరువు కిందికి మారింది, కాచుకున్న గంజి కుక్కల పాలైంది. సగం చీర చంటిదానికి ఉయ్యాలైంది, చిరుగుల సగం సిగ్గును దాచలేకుంది, తిన్న ఒక్కముద్డా ఆకలిని ఆర్పనన్నది, ఉన్న ఒక్క దుప్పటీ చలిని ఆపలేనన్నది, అంటుకునే రోగాలకు అంతమే లేకుంది, అందనంత ఎత్తులో ఆరోగ్యం శ్రీ కారం చుట్టింది, గుడ్డిదీపం చమురులేక కొండెక్కింది, దుడ్డు బియ్యానికి కార్డ్ కరువయ్యింది, చంటోడికి చదువంటే బయంగానే ఉంది, అయినా వెళ్తాడు, మద్యాన్న బువ్వ ఇంకా ఉంది. కాలం మార్పును తెస్తుంది జనజీవనం మార్పు కోరుకుంటుంది, యువత తమ దారి మార్చుకుంటుంది. కాయం కత్తుల కంబళి కప్పుకుంటుంది, కాలం నిప్పుల కుంపటి నెత్తికెత్తు కుంటుంది, కలాన్నీ, మడాన్నీ, వెనక్కి తిప్పవద్దన్నది, కులాన్నీ, మతాన్నీ ఎంచి చూపొద్దన్నది . వేయి గొడ్లు మింగిన రాబందును వేటాడి బంధిస్తుంది, పట్టుకొని పొట్ట కోసి నీళ్ళు రాని పంపుకింద కడుక్కొమంటుంది. పొట్ట నింపుకోవడాని పనికొచ్చే పట్టా వస్తుంది, చట్ట సభలలో బూతుబోమ్మలకు బట్టలేసే రోజు వస్తుంది. అంగళ్ళలో రత్నాలు అమ్మేరోజు రాకున్నా.., అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వస్తుంది తప్పకుండా వస్తుంది.
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJm0TM
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJm0TM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి