చాంద్ || కనబడుటలేదు || వాడిని గుర్తుపట్టావా..? ఒక మూగ గొంతుక చిల్లు పడి కారుతున్న చోట గాయం మీద గాయం తొడుక్కొని నగ్నంగా తిరిగేది వాడే నీ నుండి నాలోనికి నా నుండి నీలోనికి పయనిస్తూ వాడు ఎప్పటికీ ఎవ్వరికీ బందీ కాడు వాడు నిండైన వాడు రంగు లేని వాడు ఒంటినిండా రంగుల్ని పులుముకొని అద్దంలా తిరుగుతూ ఇది నువ్వేనా అని ఒక రంగు అంటిస్తూ అడుగుతాడు ఏమీ తెలియనప్పుడు,నిజంగా బ్రతికినప్పుడు కల్మషం లేని బోసినవ్వులో వికసించేది వాడే అప్పుడప్పుడూ ఆమె చేతితో తాకేది ఒడిలో జోకొడుతూ నిదురపుచ్చేదీ ఎండిన కడుపుతోనో, ఖాళీ గిన్నెతోనో చెత్తకుప్పలో అమ్మను వెతుకుతూనో ఒంటరి జీవితాన్ని కనుల నుండి కారుస్తూనో ముడతలు పడిన దేహాన్ని కప్పుకొనో... ఇలా ప్రపంచాన్ని వాడిలో దాచుకొన్నది వాడే వాడు ఎప్పటికీ దొరకడు నువ్వే వాడికి దొరకాలి అప్పుడేగా నువ్వు పూర్తయ్యేది మీ చాంద్ || 01.03.2014 ||
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4E2Dm
Posted by Katta
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4E2Dm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి