***నిశ్శబ్ధం*** నాలుగు గోడల పంజరంలో రంగు కోల్పోయిన రాచిలకను నేను ఎటు వైపుకు చూసిన శూన్యమే పలకరిస్తుంటే ఆ శూన్యంలోనే ఒక చీకటి ఆకారాన్ని సృష్టించుకుని ఆ చీకటితోనే చెలిమి చేస్తూ నిరాశ ఆటలను ఆడుతూ నిస్పృహ సేద్యాన్ని సేవిస్తూ ఎటువైపు అడుగులేసినా తిరిగి మొదలుపెట్టిన చోటుకే వస్తుంటే నా నడక కూడ నా నుంచి దూరమై ఒక మూలకి నన్ను విసిరేస్తే కదలిక లేక కూలబడ్డ నేను కాపాడమంటూ కదిలించమంటూ సాయం కోసం స్వరపేటిక అరిగేలా అర్ధిస్తుంటే మళ్ళీ ఆ చీకటి ఆకారమే నేనిక్కడున్నానంటూ పంజరానికి అటు మూలగా నిలుచుని రా..రా..అంటూ తన చేతిని అందిస్తూంటే అరికాలి నడకను మోకాళ్ళకు నేర్పించి ఆ ముళ్ళ మన్నుపై పాకుతూ పాకుతూ అటువైపుకు వెళ్ళగా, వికృత నవ్వుతో మళ్ళీ ఆ ఆకారమే నా నుండి దూరంగా ఎగిరిపోతూ నా ఊహల సౌధపు పునాది రాళ్ళను ద్వంసం చేస్తూ మరొక చీకటి మందిరానికి నా సమాధితో పునాది లేపుతుంది ఈ నిశ్శబ్ధం..... "01-03-2014"
by Sri Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jI8xku
Posted by Katta
by Sri Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jI8xku
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి