పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మార్చి 2014, శనివారం

Shivaramakrishna Penna కవిత

ధనిక వర్ణం, అగ్రకులమూ..... ధనిక వర్ణం, అగ్ర కులమూ కలుసుకున్నాయి ! ఉపకులములోనూ వర్గముందని తెలుసుకున్నాయి ! నిలువు, అడ్డము బొట్లు ఎన్నడు కలిసి తినలేవు ! వసుధ ఏక కుటుంబమంటూ దోచుకున్నాయి ! స్వధర్మాలను, ఇతరులకు బోధించు వేదాలే, డాలర్ల వేటకు, అప్రాచ్య విద్యలు నేర్చుకున్నాయి ! దళితులెందరొ వేరు మతముల బాట పట్టగనే, 'దళిత గోవింద' మని తలుపులు తెరుచుకున్నాయి ! ఏకలవ్యుడు బాణ మొక్కటి ఎక్కుపెట్టగనే, 'గీత' చాటున వేయి పడగలు దాచుకున్నాయి ! చెవిలోన ఊదే మంత్రమే, ఫోన్ ట్యూనాయే, ఏ దిక్కు తోచక, శ్రుతులు నాలుక కరుచుకున్నాయి ! దళిత, బహుజన ముళ్ళ మకుటం వెలుగు చూడగనే, అగ్రవర్ణపు తోకలన్నీ ముడుచుకున్నాయి ! మీరు పాదము నుంచి ఎందుకు పుట్ట లేదంటే, విప్రనాగుల పడగలన్నీ జడుసుకున్నాయి ! ******************** "శిశిర వల్లకి" (2012) గజళ్ళ సంపుటి నుంచి......

by Shivaramakrishna Penna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eLx5DF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి