****హృదయం**** ఎన్ని భావపు వర్ణాలో హృదయపు రాట్నంలో చేసే ప్రయాణం సుధీర్ఘమైనా అతి చేరువలో ఉన్నా గమ్యపు ఒడిలో సేద తీరే సమయాన పలుకరించే సంతోషపు వర్ణం.... దక్కాల్సిన ఫలితం దురదృష్టపు వాకిట్లో పీఠమేసుకుని కూర్చుని దీనంగా బిచ్చమెత్తుతున్న కృషిని చూసి నవ్వుతున్నప్పుడు ఆవరించే అసహనపు వర్ణం..... కనుల లోగిలి వీడలేని కన్నీళ్ళు అప్పుడప్పుడైనా మెరుద్దామనుకున్న హాసపు నీడను తరిమి తరిమి కొడుతుంటే అధరోష్టపు ఆలింగనం మధ్యలో నలిగిపోతున్న మునిపండ్లు బాహ్య ప్రపంచాన్ని చూడలేక అవస్థ పడుతున్నప్పుడు దరికి చేరే దుఖ్ఖపు వర్ణం.... చిమ్మ చీకటిన, కంటికి ప్రకాశాన్ని పంచే ప్రక్రియలో తన ఒంటికి మంట పెట్టుకుని తను కాలిపోతూ అజ్ఞాతంలో కాంతిని ప్రజ్వలింప చేస్తూ కర్తవ్యంలో ఆరిపోతున్న మైనపు ప్రాణంపై గాలి చూపించే జాలి వర్ణం....... సూర్యుని తాపానికి నీరసించిపోతున్న ధరణిమాత తన గురించి మరచి మరి మానవాళి కాళ్ళకు ఊతమిస్తూ వేడిమి తగ్గే సమయానికి కాసింత సేద తీరుతుంటే అటుగా వెళుతున్న వెన్నెలమ్మ మబ్బుల సాయంతో మంచు కురిపిస్తుంటే వెలిసిన మంచితనపు మమకారపు వర్ణం..... అన్నింటా మంచిని చూపి చెడు ఆలోచనను చుట్టుపక్కల రాకుండా చేసి ఆగిపోతున్న గుండెలో కూడ తిరిగి కదలిక రప్పించి కఠినమైన హృదయంలో కూడ కనికారాన్ని కల్పించి అంధకారపు ఆలోచనలలో వెలుగు కిరణాలను నింపి ఈ లోకాన్నే ముందుకు నడిపిస్తున్న అతి ముఖ్యమైన ప్రియమైన ప్రేమ వర్ణం..... ****ఎన్నెన్నో వర్ణాలు మన హౄదయాలలో అన్నిట్లా అందాలు ఈ ప్రపంచంలో**** శ్రీ----1-03-2014
by Sri Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pHuZ0w
Posted by Katta
by Sri Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pHuZ0w
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి