తిలక్/అవ్యవస్థితం Unsettled Crap Forever ---------------------------- ఇంకొన్ని రోజులు రాలిపోతుంటాయి మన నుండి స్తబ్ధుగానే ఏం దాచుకొన్నామోని మనసు భీరువా తెరిచి చూసుకున్నపుడు కొన్ని చెదలు పట్టిన పుస్తకాలు అర్థం కాకుండాను కంటి అరల కింద పేరుకుపోయిన మరిన్ని అవశేషాలూనూ సరే ఈరోజిక సరిగ్గా సర్దుదామని నిర్ణయించుకున్నాను నిండుకున్న ఖాళీల్లో వ్యవస్థితంగా కూర్చలేకపోయాను జ్ఞాపకాల ముతక వాసన వల్లేమో అంతర్గతంగా చిరిగిపోయిన పేజీల్లో అక్కడక్కడా కొన్ని ఓదార్పు అతుకులు తుప్పుపట్టిన కొన్ని వికట గరళాలు ఎక్కడ చూసినా ఎప్పటికి సమకూర్చాలేనేమో ఇక ఇంకా అమరుస్తూనే ఉన్నా లోలోపలే పదిలంగా. తిలక్ బొమ్మరాజు 23.02.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eiGQZM
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eiGQZM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి