పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

DrAcharya Phaneendra కవిత

తెలుగు భాష వారధులం! - డా. ఆచార్య ఫణీంద్ర ఎవరి పంట వారిది! ఎవరి వంట వారిది! ఎవరి తిండి వారిది! ఎవరి కండ వారిది! ఇక తగాదాలు లేవు - ఇక విభేదాలు లేవు - ఇక వివాదాలు లేవు - ప్రాంతాలుగ విడిపోయాం - ప్రజలుగా కలిసుందాం! రాష్ట్రాలుగ విడిపోయాం - రక్తబంధ మరయుదాం! మనమంతా సోదరులం! తెలుగు భాష వారధులం! ‘తెలంగాణ’, ‘సీమాంధ్ర’ రథ ద్వయపు సారథులం! ఒకరి నొకరు గౌరవించి, ఒకరి కొకరు సహకరించి, పరస్పరం పోటీ పడి ప్రగతి పథా లేలుదాం! భరతదేశ పటంలో ప్రకాశిస్తూ సాగుదాం!! ప్రపంచం కనుగవలో రత్నాలుగ మెరుద్దాం!!! --- &&& ---

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1egXJEn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి