గుబ్బల శ్రీనివాస్ ।। అద్దంలో ప్రతిబింబం ।। ------------------ ఇక్కడ ఒక విషపు నవ్వు ఉద్బవించినప్పుడు గాజు బిందువులతో గాయపడుతుంది అక్కడ అద్దంలో ప్రతిబింబం. మది వుగాదికోసారి విచ్చుకున్నప్పుడు సిగ్గుతో అస్తిత్వం కోల్పోతాది అనురాగపు పొరలను ఒక్కొక్కటిగా త్యజిస్తూ. పెదవులు పలుకుల అగాదాలు తవ్వుతున్నప్పుడు గునపాల గాయాలతో లోతులను మూగగా పూడ్చుకుంటాది. ఒక కంటిలో స్వార్ధపు వెలుగు వెలిగినప్పుడు నిశీదిలో చీకటిలా తనని తాను కప్పేసుకుంటాది. శరీరం సందేహమై తడుముకున్నప్పుడు కళ్ళు కొలిచే స్పర్శలకు జీవం కోల్పోతుంటాది. ముస్తాబు దిద్దుకున్న తోలుతిత్తుల అందం మురిసిపోతుంటే అద్దం ముందు వడిలిన కుబుసంలా వేరు పడుతుంటాది ప్రతిబింబం కురూపి స్వరూపాన్ని బరించలేక ! (23-02-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cDBZpF
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cDBZpF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి