ఖోజ్:::: ఎక్కడ గాలిస్తున్నావ్ ఒక అందమైన జీవితాన్ని నీకు నువ్వే స్వయంగా మూసుకున్న సమాధి గర్భంలోంచి??? చెప్పిన పాఠాలన్నీ చిన్నప్పుడే మరిచిపోయావు కిరణజన్య సంయోగ క్రియను ఏనాడైనా ఆలోచించావా? బొత్తిగా జాంథోఫిల్ బతుక్కి సిధ్ధమై పోయావ్ కొన్ని కట్టెల కోసం కొమ్మల్ని నరుక్కుంటున్నావ్ నువ్ కూచున్న కొమ్మొకటి -నిన్ను చూసి నవ్వుకుంటున్నది తెలుసా?? బండబడ్డ నేలను చూసి కుంగిపోతున్నావ్ కానీ ఇంకో పోటు గట్టిగా వేస్తే పాతాళ గంగ పోటెత్తి నీ పాదాలు కడిగి పోదూ? మూర్ఖుడా! నువ్ పయనిస్తున్నది అమృత సాగరం మీంచే ఓపిగ్గా కొంచెం ఒడిసి పట్టుకో!!! అందమైన జీవితాన్ని వెదకడ మెందుకు?? అది తూనీగలా నీ తలలోనే చక్కర్లు కొడుతుంటేనూ..... (మా చదవాల్సిన మిత్రుడు దీన్ని చదువుతాడని ఆశిస్తూ....) 22-02-2014,మంచిర్యాల్.
by Patwardhan Mv
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p8oIe5
Posted by Katta
by Patwardhan Mv
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p8oIe5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి