పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Sravanthi Itharaju కవిత

స్రవంతి ఐతరాజు "సౌగంధిక జాజరలు" "జీవితం" ప్రతిసారీ ఓడించడమే పనిగా పెట్టుకుంది జీవితం ఓడిన ప్రతిసారీ పడిలేచిన కెరటంలా పైకిలేవడం వ్యసంగా మారింది గుండె కన్నీరు పెడ్తోంది.. ఆత్మీయత కరువైంది కనురెప్పలు పడనీక కంటిపాపల వత్తులు వేసుకుని ఎదురు చూసిన చూపులు మసకబారి మసిగట్టి కొడగట్టిపోతున్నయ్ ప్రేమ సాగరాన్ని ఈదుకుంటూ పయనించిన ప్రేమ నౌక వొడ్డును సమీపించింది కానీ... ఆవలి తీరంలో ప్రేమ జాడలే లేవు.. కనీసం ప్రేమ పాదముద్రలైనా కరవైనాయి ఎలాగోలాగ అదిరే గుండెల అదుముకుని గుడితలుపులు తెరిచేందుకు చేసిన ప్రయత్నం మూర్తిలేక బోసిపోయిన హృక్కుహురాన్ని చూసి మూగబోయింది అప్పుడే.... ఆకసంలో ఓ మెరుపుతీగె..ఓ అభయహస్తం నన్ను వోదార్చే దివ్య ప్రేమ హస్తం.. తడిమింది నను ఆపాదమస్తం నిలువరించింది..ధైర్యాన్ని నూరింది నన్ను నేను తెలుసుకోమంది అపాత్రాదానాల ప్రేమ దానాలు వద్దని వారించింది దీన మోముల తనను చూడమంది ఆక్రందావ్యధల వొడిగాయమంది అటూ ఇటూ ఆటుపోట్లతో.. చివరకు జీవితం ఓ అలవాటుగా మారింది

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Op9yU7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి