........ప్చ్ ............................................. భక్తి ఛానెళ్లయి ప్రవహిస్తున్నా భక్తులు కరువౌతున్న కాలం సంబరాలు అంబరాలనంటుతున్నా సంతోషం దిక్కులు చూస్తున్నకాలం విజ్ఞానం ఒడిలోబొంగరంలా తిరుగుతున్నా వికాసం వెలవెల బోతున్న కాలం ఉద్యమాలు ఊపిరి సలపనియ్యక పోయినా ఉద్దేశ్యాలు ఉట్టికెక్కుతున్న కాలం దృశ్య మాధ్యమాల దృక్పథాలేవైనా దుష్ట సంప్రదాయాలు దృగ్గోచరమవుతున్న కాలం నూరు దోసిళ్ళ కాసులకు మూడు దోసిళ్ళు చదువులమ్ముతున్న కాలం నాయకులు కురిపించే కారుణ్య వర్షాలకు తలమునకలై కర్షకులు తలలు వేలాడేస్తున్న కాలం డబ్బు చేరితే చాలు పబ్బాలన్నీ పబ్బులకూ క్లబ్బులకూ పరుగులు తీసే కాలం పడగొడితేనే నిలబడగలమనుకున్న పదవులు బేరసారాల పందేరాలు పెడుతున్న కాలం రాని ఉద్యోగాలు ఉత్తర దక్షిణాయనాల చుట్టు వచ్చిన ఉద్యోగాలు బాధ్యతలక్కరలేని హక్కుల చుట్టూ చక్కర్లు కొడుతున్న కాలం దబ్బూ దస్కం లేకుండా దగ్గుపడిశం తెచ్చుకున్నందుకు జబ్బు నిన్ను నడి బజార్లో నిలదీసే కాలం కుంభమేళాలు జరిగినా పుణ్య నదులకు పుష్కరాలొచ్చినా అధినాయకుల సంకల్పాలు జపిస్తూ ఆత్మగౌరవ పిండ ప్రదానాలకు అనువౌతున్న కాలం సంతోష సంతాప సందేశాలకు సొల్లు వాగుళ్ళకు సెల్లు గిల్లే మానవ సంబంధాల కాలం నిన్ను నువ్వు పాతేసుకోడానికి నిజాయితీ గొయ్యి తీసే కాలం ఏమంటే ?ష్ ! ....ఇది కలికాలం...ప్చ్....
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhBplO
Posted by Katta
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhBplO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి