కూరాకుల వెంకట చలపతి బాబు || ఆవే(దన)శం || అయ్యో!.. అటుచూడండి.. ముక్కు పచ్చలారని పసికందు పంచవర్షములైనా నిండని చిట్టితల్లి.. అమ్మ చేతి గోరుముద్దలతో అమ్మ నోటి లాలిపాటలతో ఆనందించి.. తన ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో.. అందరిని పరవశింపచేస్తున్న ఆ బుజ్జి తల్లిని చూడండి.. మృత్యువుతో ఎలా పోరాడుతుందో.. ఆ మృగాడి పైశాచికానికి ఎలా తల్లడిల్లి నరకయాతన అనుభవిస్తున్నదో.. అ!.. అటు చూడండి.. ఆ దారుణం చూడండి.. చదివి ఇంటికి వెలుగులు పంచాలి అనుకున్న ఓ చెల్లి జింక పిల్లను సింహాల మంద వేటాడినట్లు తమ వాంఛను ఎంత కిరాతకంగా తీర్చుకున్నారో.. "అమ్మా! మృత్యుదేవతా.. నాకు ఈ లోకంలో ఉండాలి అని లేదు.. మూగ జీవులను భక్షిస్తూ మృగాలుగా మారి అణువణువు కామకాంక్షతో తిరుగుతున్న ఈ దౌర్భాగ్యుల మధ్య వావి వరుసా, చిన్న పెద్దా తేడా లేకుండా కోరిక తీర్చుకుంటున్న ఈ కీచకుల మధ్య నేనుండలేనమ్మ.." అంటూ అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడి మృత్యుదేవత ఒడికి చెరిన ఆ సోదరిని చూడండి.. హా!... ఏమిటి ఈ ఘాతుకం.. పసిపిల్లల అపహరణ.. పసికందుల ప్రాణం విలువ ధనమా? ఎంతటి క్రౌర్యం? ఎంతటి నీచ సంస్కృతి.. ఛీ.. ఛీ... తూ తూ... జీవితాన్ని ఎలా గడపాలో తెలియని దౌర్భాగ్యులారా.. "స్త్రీ"ని ఎలా గౌరవించాలో తెలియని అధములారా మనిషిని మనిషిగా చూడలేని ఆటవీకులారా.. అతివ కూడా మనలానే.. చీము రక్తము మాంసపు ముద్దలు కలిగిన మాములు జీవి అని గుర్తించని మూర్ఖులారా.. ఎందుకు మీకీ బ్రతుకులు..? ఎందుకు మీకీ జీవితాలు..? 04-02-2014 /** పత్రికలలో రోజు చూస్తున్న కొన్ని సంఘటననుండి ప్రేరణ పొంది రాసిన భావాక్షరాలు
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6W6AW
Posted by Katta
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6W6AW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి