//రాజేంద్ర ప్రసాదు // ఓ చిన్ననాటి నేస్తమా // చిన్ననాటి స్నేహానికి చెద పట్టింది పిలిచినా వినపడనంతగా చిన్ననాటి స్నేహానికి ముసురు కమ్మింది నేను కనపడనంతగా నా హృదయం తన స్నేహం కోసం ఎదురు చూస్తుంటే నా హృదయం తన స్నేహం కోసం తపన పడుతుంటే కొంటెగా వచ్చి ,నేనున్నాను అని నన్ను గిల్లి మబ్బుల మాటున చంద్రుడి లాగా పలకరిస్తూ వెళ్ళిపోతుంది ఏమి కోరాను ఓ నేస్తం - నీ నుంచి ఒక చిన్న చిరునవ్వు తప్ప ఏమి కోరాను ఓ నేస్తం - నీ నుంచి నాతో నడిచే నీ మైత్రి తప్ప ఎక్కడున్నా - నీ చిన్న చూపు చాలు నా మనసుకు జవాబు నివ్వటానికి ఎంతవాడివైనా - నా పేరు నీ నోట వింటే చాలు నా మనసు తరంగాలకు -సర్ది చెప్పుకోవటానికి ఆనాటి బండలు దగ్గర ,కబుర్లు ఏమైనవి ఆనాటి మన ఉనికిని చూసిన చెట్టూ-పుట్టా , నీరూ- గాలితో సాగించిన ఊసులు ఏమైనవి స్నేహం ఎక్కడనుంచి ,ఎటునుంచి పుట్టినా చిననాటి స్నేహమే కదా -మధురమైన స్నేహము ఒక్క క్షనమైననూ విడువక ఉంటిమి కదా ఇన్ని రోజులు ఒంటరిగా నన్ను చేసితివి నీకు గుర్తుండక పోవచ్చును ఆ రోజులు నీ జ్ఞాపకాలను మరువ వద్దంట్టున్నవి ఈ రోజులు నీ సుఖం ,సంతోషం నేను కోరుకున్నవి కాదా కొత్తగా వచ్చిన స్నేహాల చాటున నా మైత్రి నీకు కానరాకున్నదా ! ఇన్ని చెబుతున్నా ,అడుగుతున్నా నీ మౌనం గీత దాటి బయటకు రాదా ! చిన్ననాటి స్నేహమా - చేదిరిపోయావా చిన్ననాటి మిత్రమా - నీవు మారిపోయావా నీవిప్పుడు ఎలావున్నా నాకు సమ్మతమే కుచేలుడనై ఎదురుచూస్తుంటా నీ కోసం ,నీ స్నేహం కోసం నన్ను మరువకుమా - ఓ చిన్న స్నేహమా పెద్ద మనస్సుతో పలకరించు మిత్రమా పెద్ద ఆశ ఏమీ లేదు సుమీ నీ స్నేహముంటే నాకు లేనిది ఏమీ ? తేదీ : 05. 02 . 2014
by గరిమెళ్ళ గమనాలు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fustUp
Posted by Katta
by గరిమెళ్ళ గమనాలు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fustUp
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి