పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

నవీన్ కుమార్ కొమ్మినేని కవిత

!!కొన్ని ప్రశ్నలు!! గతించిన కాలాన్ని సరికొత్తగా సుతిమెత్తగా స్పృశించి కళ్లనుండి జారుతున్న జ్ఞాపకాలతో కడుపు నింపుకుంటాను ఆకలంటే అర్థమేమిటి? శ్రీరంగాన్నో దేవులపల్లినో ఆత్రేయనో వేటూరినో దోసిట్లోకి ఒంపుకుని తనివితీరా తాగేస్తాను దాహమంటే ఏమిటి? ఒకక్షణం ఆకాశవీధిలో విహంగాన్నై విహరిస్తే మరుక్షణం సాగరగర్భాన చేపనై ఈతకొడతాను నా ఇల్లెక్కడున్నట్టు? ఇంకా, నేటి నేనుగా నిన్నల్లోకి పోయి నుంచుంటే నాకు నేను నవ్వులాటగా కనిపిస్తాను మధ్యలో ఏం జరిగినట్టు? ముద్దబంతి పువ్వుని మురిపెంగా చూస్తుంటే మొదటిప్రేమ గుర్తొచ్చి మనసు ముద్దముద్దవుతుంది ఆనాటి ప్రణయాలిప్పుడేమైనట్టు? -------నవీన్ కుమార్ కొమ్మినేని (06/Feb/2014)

by నవీన్ కుమార్ కొమ్మినేని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awTitL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి