పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Kavi Yakoob కవిత

కవిత్వం కావాలి కవిత్వం - త్రిపురనేని శ్రీనివాస్ ........................... కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జలజల లాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ప్రజల మీదే రాయి ప్రజల్లోని అనాధ గాధలమీదే రాయి కవిత్వం రాయి కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకి దూసుకుపోయే కవిత్వం రాయి అలా ఒక వాక్యం చదవగానే శత్రువు ఠారెత్తి పోవాలి అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి కవిత్వం వేరు వచనం వేరు సాదా సీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై తేలిపోతావ్ కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జివజివ లాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ఫుట్ నోట్సులు ఉన్నది కవిత్వం కాదు అక్షరానికి అకష్రమే వివరణ అథోజ్ఞాపిక లెందుకు చివరాఖర్న బ్రాకెట్లు పెట్టేది కవిత్వం కాదు సానుభూతికి సహానుభూతే సహజానుభూతి కుండలీకరణా లెందుకు అక్కడి కక్కడే వాడి గుండె చీల్చి బూజు దులపాలి దబాయించాలి ధన్ మని గన్ వై పేలాలి కవిత్వమై కాచుకో అనాలి తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని మొరాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై సోలిపోతావ్ కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కువకువలాడే కవిత్వం కావాలి కవిత్వం జ్ఞాపకాల లోయల్ని తవ్వకు అయ్యో పాపం అనకు సాగదీసిన సానుభూతి వాక్యాలొద్దు జాలి జాలి ఏడుపుమొహం డ్రామాలొద్దు అతడి ఛాతీమెద ధాటీగా రెండు నమ్మకాల్ని రాయి ధైర్యంగా శౌర్యంగా అతడ్నొక వీరుడ్ని చెయ్ కవిత్వమై అతడికి కాపలా కాయ్ చెత్తల్ బుట్టల్ మాటల్ రాల్చి కవిత్వమని ఘీంకరించకు కవిత్వాన్ని వంచించకు వచనమై పుడతావ్ కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కళకళ లాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం (First published in Andhrajyoti Daily, Feb 19, 1989; reprinted in the poetry anthology "kavitA O kavitA", Editor: Papineni Sivasankar)

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fuBZag

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి