పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Sai Padma కవిత

సాయి పద్మ //చూస్తూ, వింటూ, కలుస్తూనే ఉన్న నా నువ్వు ..! ఎక్కడో చూసినట్టే ఉంది నిన్ను .. పులుసు కలయబెడుతూనో, వెల్లుల్లి సరిపోతుందో లేదో అని ఆదుర్దా పడుతూనో చిక్కగా చిక్కడిన దారపురీలుని సవరదీస్తూనో, తటాల్న విసిరే మాటల గాయాలకి మందు రాసుకుంటూనో మోకాళ్ళ నెప్పుల నిప్పుల గుండం కుంటుతూనో అరిచేతుల ఆవిరైన స్వర్గాల పెళుసులు నిమురుతూనో ఎక్కడో విన్నట్టే ఉంది నీ మాట సుళ్ళు తిరుగుతున్న సంగీతం హటాత్తుగా ఆగిన అపశ్రుతి లా అరిగిపోయిన మంగళసూత్రంలో విరిగిపోయిన లక్క శబ్దంలా జవాబు తెలిసీ మాట్లాడని భేతాళిని లా , నీ కళ్ళల్లో నీ మాట వినపడుతూనే ఉంది అత్యంత రుచికరమైన నీ అసహనపు తిరగమోత లయలా ఎక్కడో కలిసినట్టే ఉన్నాను నిన్ను వోద్దిగ్గా మడతపెట్టిన కుర్చీలో, జాగ్రత్తగా సర్దిన పేపర్ల మధ్య జయజయధ్వానాల చప్పట్ల కీర్తి వెనుక సాయంకాలపు నీరెండలో వొంటరిగా వచ్చిన పేరెంట్స్ మీటింగుల్లో , నిరామయ జంట చేతుల చప్పట్లలో నిర్లక్ష్యపు ఆహాలకు నలిగి, మూడంకె వేసిన మొహాల కన్నీటి మధ్య బితుకు బితుకు మంటూ కలిసీ కలవని పాత స్నేహితుల మాటలలో చూస్తూ, వింటూ, కలుస్తూనే ఉన్నాను నిన్ను ఇక్కడే , ఎప్పుడూ, నీ మేధో సమాధుల్లో మెదడు దాచిన మేకపు తళుకుల మధ్య నీరవమైన జీవోత్సాహపు చిరుచెమటల మెరుపుల వరుసల్లో సమాధానపడుతూ, నువ్వు నమ్మినట్టు నటిస్తున్న నీ కవితల పంక్తుల్లో ..!! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N24owL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి