పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। ఆకాశం కన్నీరు కార్చింది ।। --------------------- కళ్ళకు అదో కనికట్టుల మాయాజాలమే కనుచూపు మేర సూన్యమే అయినా అందమైన నీలి చిత్తరువే ఆ ఆకాశం. బగబగ మండే సూర్యతాపాన్ని వడకట్టి నీలి నీరెండనే జగతికి పంచేను నేల మనుగడకు గొడుగై రక్షణ ఇచ్చేను. తన బిడ్డల మేఘాల కౌగిలింతల్లో చినుకై వర్షించి అవనికి సొగసులెన్నో అందించేను. చీకటై తాను నల్లబారినా రేరాజుని నొసటన దిద్దుకుని మురిసిపోతాది. ఇంతలో ఓ ఘనుడు పుట్టాడు స్వార్ధం ,పగ కోరాడు పరిశ్రమలు ,కాలుష్యం సృష్టించాడు పంచభూతాలను శాశించాడు పచ్చని హరితవనాల్ని హరించాడు ప్లాస్టిక్ వ్యర్ధాలను పెంచాడు నీలాకాశానికి పొగబెట్టి, ఉక్కిరి బిక్కిరి చేసి, సహజ ఋతువులను మాయం చేసి మేఘమధనాలతో గాలిలోనే విన్యాసాలు గావించాడు. ఊహలకు ,మేధస్సుకి రెక్కలు తొడిగి రాకెట్లను అగ్నిగోళంలా మండిస్తూ నింగిని చీల్చి అంబరంలో సంబరమన్నాడు. నిరంతరం మండే సూర్యతాపమే బరించింది మాయ మనిషి పెడుతున్న మంటకు ఆకాశం కన్నీరు కార్చింది ! (04-02-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nMloVm

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి