పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Kavi Yakoob కవిత

విజయనగరంనుంచి పాయల మురళీకృష్ణ అనే కవిమిత్రుడు ,ఇటీవలే తాను ప్రచురించిన కవితా సంపుటి ' అస్తిత్వం వైపు' పోష్టులో నిన్న పంపాడు. సాయంత్రం ఆ సంపుటిని చదువుతూ గడిపాను. కె.శివారెడ్డి గారు ముందుమాట రాశారు. అందులోంచి కొంతభాగం ~ ఒకానొక విషాద సమయంలో Poetry makes me you ! ................................................................... " ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా ఉంటా ; ఎవరు కేకేసినా వెళ్ళిపోతా- ఎందుకో తెలుసా- ఒకటి : to locate a new poet, to discover new voice, fresh and vibrant voice. రెండు : ఈ సంచారాలలో నన్ను నేను కనుక్కోవడానికి, బతికించుకోవడానికి, ఎప్పటికప్పుడు కొత్తతరంతో Readjust చేసుకోవడానికి, కొత్తతరపు ప్రాణవాయువును నా గుండెలనిండా నింపుకోవడానికి, ఇదొక నిరంతరాన్వేషణ. అలా ఆకలిగొన్న కళ్ళతో ఆవురావురుమంటూ తిరుగుతున్నప్పుడు తటస్థపడ్డాడు,మురళీకృష్ణ. పాయల మురళీకృష్ణ.విజయనగరం జిలా, మెంటాడ గ్రామవాసి,ఉపాధ్యాయుడు. తనూ,నాలానే తన పిల్లల్లో,విద్యార్థుల్లో తనను డిస్కవర్ చేసుకుంటానికి ప్రయత్నిస్తూ ఎక్కడో, ఏ పత్రికలోనో కవిత అచ్చయితే - కవిమిత్రులు ,' అర్థం కాకుండా రాస్తున్నావని' అంటే, కించిత్ కలతపడి, అయోమయపడి నాకు ఫోన్ చేస్తే- నేనడిగితే తను ఆ కవిత పంపితే -చదివి Do not worry-you are on the correct line, Go ahead అని ప్రోత్సహించా. తర్వాత నేనూ ఆలోచించా తోటివారు అలా ఎందుకన్నారని. ఒక కొత్తరకమైన ఆధునిక కవిత్వ వ్యక్తీకరణ, పద్యనిర్మాణం కారణమని అన్పించింది. అది తనచూపు నుంచి- తను కవితను ఊహించే పద్ధతిలోనే ఒక కొత్తదనం ఉండటాన, భిన్నంగా ఉండటాన, తనదైన కవిత పరిభాష ,నిర్మాణం, సాధించుకునే క్రమంలో ఉన్నాడు కాబట్టి. వస్తువుని చూడటం- చూడటంలోనే వినూత్నంగా ,విశిష్టంగా ఉండటం, బొమ్మమీద బొమ్మ కూర్చడం- పదబంధాలు, వాక్యనిర్మాణాలు -ఎత్తుగడ ,నిర్మాణం, మలుపులు- వీటన్నిటిలో తనదయిన ప్రత్యేకత సాధించడానికి ప్రయత్నించే క్రమంలో - మామూలుగా ఉన్న వ్యక్తీకరణకీ, నిర్మాణానికీ భిన్నంగా ఉండటం వల్ల - తోటికవులు,పాఠకులు యిబ్బంది పడ్డారా/ పడే అవకాశం ఉందా? కవిత అచ్చవుతుంది. పఠనీయమవుతుంది. మరోసారి చదివి -కవితలోకి చొరబడే ప్రయత్నం చేయడం లేదా? బద్ధకపు పాఠకుడి ' సాధారణీకరణ' ను లెక్కలోకి తీసుకోవాలా- కొత్త కవిత్వాన్ని క్రమంగా పరిచయం చేయాలా -వద్దా? ఇలా చాలా విషయాలు ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే -పాయల మురళీకృష్ణ, పాయల మురళీకృష్ణ అయ్యాడు. ఏ కవయినా ఆ కవే కావాలి. మరొకడు కావడానికి వీల్లేదు. తనదయిన వ్యక్తీకరణ కవిత్వపు ఉనికిని తను చాటాలి. " పాయల మురళీకృష్ణ నంబర్ ~ 89652 86969

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awOXqn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి