అవీ... ఇవీ...కొన్ని ఫెంటోలు ఒక చిరునవ్వు వెంట నాల్గక్షరాలు ఒలికించి చూసావా! ఎప్పుడైనా! *** నడినెత్తిన ఎండపొడలో స్నేహ కౌగిలికై నగ్నపాదాల నడిచావా! *** గుమ్మటాలలోని పావురాలు గింజలేరుకుంటూ తీసే కూనిరాగం విన్నావా! *** ఎదురుచూసి సొమ్మసిల్లిన పూరేకులను ప్రేమారగా ముద్దాడావా! *** తలుపు తెరిచిన గదిలో పగులగొట్టిన సుగంధాన్ని ఆఘ్రాణించావా! *** కొంగలబారు రెక్కల శబ్దం వెనుకెనుకే పయనించాలని చూసావా! *** ఒక్కసారి ఇటువస్తావా పొరలువిప్పి బాల్యంలోకి దూకి ఆడుకుందాం 12.08.2012
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MVoiIF
Posted by Katta
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MVoiIF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి