పుస్తకం తెరచి ఎన్నాళ్ళయ్యిందో! ~*~ పళ్ళచక్రాలను బిగించుకున్నట్లు అంతా నియమితంగా తిరుగుతుంది ఓ వయస్సు దేహంపై వాలాక నిద్రపొరను వదిలేయడం ఎంతకీ అర్థంకాదు కాలేజీ రోజుల్లో నీళ్ళు కుమ్మరించినా మత్తువదలని కళ్ళేనా అనే ఆశ్చర్యం ఎవ్వరూ నిద్రలేవని సమయానికి పాలప్యాకెట్టును ఆహ్వానిస్తే ఇక వంటగదిలోంచి కాఫీ వాసన పక్కింటికి చేరుతుంది పొయ్యిపై అన్నం ఉడుకుతుంది చూస్తుండు అని అమ్మచెబితే పొంగిన ఎసరుతో ఆరిపోయిన కట్టెలపొయ్యి ఎగాదిగాచూసింది నేనేనా! కొద్దిగా నడక ఓ బ్రెస్సు పేస్టులతో వ్యాయామం కొలతప్రాకారం గొంతులోకి కొంచెం దిగాక వాటికి తోడుగా కొన్ని మాత్రలు ఇక ఆఫీసుకు బయలుదేరాలనే ఆత్రం మొదలౌతుంది దేహాన్ని కొంచెం కడిగి కావలసినవేవో సర్దుకుని ముఖ్యంగా తాళాలు, కళ్ళజోడు రోడ్డెక్కి వాహనం కోసం ఎదురుచూపులు ఆలస్యమైదేమోనని బేజారులు ఒక్కసారి వాహనం ఎక్కాక మళ్ళీ తిరిగి ఎక్కినచోటే దిగేదాకా ఎక్కడున్నానో నాకే తెలియని స్థితి ఎందుకంటే రోజూ ఏదొక సమస్యల ఫైళ్ళు తెరుచుకుంటూనే ఉంటాయి తెరుచుకున్న కంప్యూటరు వేడెక్కిన తన దేహాం ఎప్పుడు చల్లబడుతుందోనని చూస్తూనే వుంటుంది ఇంటికిచేరాక ఆకలి నాలుగు మార్గాల రోడ్డెక్కిన కొత్తకారులా పరుగెడుతుంది మళ్ళీ కొలతలతో ఆహారం జతగా మాత్రలు అరాకొరా అంతర్జాలవిహారం మొదలయ్యాక అలసట రెప్పలపై వాలుతుంది దేహం ఎప్పుడు పక్కపై వాలుతుందో! దాచుకున్న ఆశల ఇష్టాలు అలా షెల్పుల్లో దాక్కున్నట్టే ఉంటాయి కొనుక్కున్న పుస్తకమో మిత్రులు ప్రేమగా పంపిన పుస్తకమో అలంకారాలైన అనేక పుస్తకాలు క్షణాలు కణాల మద్య నిరంతరం సంఘర్షణ పుస్తకం తెరచి చాలారోజులయ్యింది. .....................17.6.2014 21:30 గంటలు
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0O69
Posted by Katta
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0O69
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి