పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || ఈ జన్మే ఓ వరం !! || నా నేస్తమా ..ప్రియ మిత్రమా !! చీకటి చిక్కనై చుట్టు ముట్టిందా చింతించకు ! పున్నమికి చేరువవుతున్నావని మరువకు యామిని జీవితాన్ని చిదిమేస్తుందా బాధెందుకు? వేకువకు దగ్గరవుతున్నావని తెలుసుకో ..! దారిపొడుగునా పూలు పూలచాటునా ముళ్ళు ... గుచ్చి వేధించే గుణ పాఠాలు.....!! వెలుగు నీడల రుచుల్లేని జీవితం నిస్సారం ... ఎడారుల్లో ఎండమవులు....ఒయాసిస్సిలు ... కష్టాల కొలిమిలో కాలి కాలి .. జీవితమే ఉక్కు కరవాలమవ్వాలి ... కదన కుతూహలమవ్వాలి .... మృత్యువు సైతం నిన్ను చూసి గజగజా వణకాలి ... మరణం అనివార్యమే ... అదెప్పుడో.. ఎక్కడో ...తప్పదు ... హరిణమయి పారిపోక ... శార్ధూలమై..శాశిద్దాం... ఆశల సౌధాన ఆఖరి క్షణం దాకా జీవిద్దాం !! అమృతానంద మయ ఈ మానవ జన్మని పరిమళి౦ప చేద్దాం !! --------------------------- 10 – 06 -14

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mDlzi5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి