_O_ ఇసుకను లెక్కేస్కుంటున్నాడాడు ఒక్కో రేణువు ఒక్కో జీవితంగా!! లెక్కేసి వెనక కుప్పేస్కున్న ఇసుక జీవిస్తోందింకా.. సముద్రాలన్నిటినీ అలా తీరాలతో పూడ్చేశాక అంతా ఒక తీరమై లెక్క ముగిసింది మొదటి రేణువు దగ్గర!! ఒకటి తోనే ముగిసిన లెక్కను చూసి విసుగుతో వెనక్కు తిరిగి చూస్తే సముద్రాల్లేవ్!! ఇన్ని తీరాలు దాటినా సముద్రం రాలేదని మళ్ళీ మొదటి రేణువుతో లెక్క మొదలు!! సముద్రమే వాడు చేరాల్సిన తీరం.. ఎదురొచ్చాక పూడ్చడానికే వాడి ఈ తాపత్రయం!!_______(10/6/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWdRUz
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWdRUz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి