పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

R Rama Krishna కవిత

ll జీవన సాఫల్య క్షణాలు ll ఆర్. ఆర్. కే. మూర్తి – 30/01/2014 మొహాలు కనపడక పోయినా ఆ నడి రాతిరి వెలుగులు ఆ వేళ్ళు వణికే వెచ్చటి చలి లౌక్యంతో పనిలేని పిచ్చి ముచ్చట్లు ఆగి ఆగి దూరంగా వినిపించే కోలాటం పాటలు అప్పుడప్పుడు శబ్దం చేయొద్దని కసురుతున్నట్టు కువ కువ లాడే తల్లి పక్షులు తెలవారుతుందన్న దిగులు తెలవారకపోతే బాగుండునన్న కోరిక పొడవైన శ్వాసలు లయ తప్పుతూ లయమవుతున్న గుండెల దడలు గొంతుల్లోంచి గుస గుసగా శ్రుతి కలిసే కూని రాగాలు ఉండుండీ నలిగిపోతున్న గడ్డి పరకల గర గరలు చేతులు చాస్తే అందుతున్నట్టనిపించే ఆ భూమ్యాకాశాల అంచులు బిగ్గరగా వస్తున్న నవ్వును ఆపడానికి ఒకరి అరచేతులు ఇంకొకరిపై చేసే ప్రయత్నం నేనూ, నాదన్న స్పృహ లేనే లేక పోవడం భూత, భవిష్యత్తులున్నాయన్న స్ఫురణే రాకపోవడం చేతుల్లో చేతులు వేస్తే ముల్లోకాలూ మన మధ్యే ఉన్నట్టు *** నేడు మనవి కాని ఆ పరిసరాలు "ఇచ్చోటనే కదా !" అంటూ పిండేస్తుంటాయి గుండెల్ని.. మనకిక లేని ఆ నిమిషాల సాక్షిగా కదులుతున్న కాలం పరిహసిస్తుంది "మారింది మీరే"నని ! మనకు మాత్రమే తెలుసు అవి మన జీవన సాఫల్య క్షణాలని మన బ్రతుకులు సఫలం అయినా.. కాకపోయినా.. !

by R Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pYIOcF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి