డా.రూప్ కుమార్ డబ్బీకార్ // మార్మిక నదం -------------- దూరాన, సాగర తీరం పై అలల లెక్కలలో తన రెక్కల చప్పుళ్ళను మరిచిపోయి తీతువు పిట్ట మేల్కొనేవుంది ద్వారపాలకా ! మేలుకునే వున్నావా ?! చీకటినంతా నా గది లోకి వొంపి వెలుతురు ముసుగును కప్పుకొని మృత్యువుని స్వప్నిస్తున్నావా !! శరీర నగర ద్వారాలు ముసివేయబడుతున్నాయి అంతా సుషుప్తి లోకి జారుకుంటారు చీకటికి, పగలుకు తేడా లేదు ముళ్ళ తీగల మీద కదా నీ నడక అర చేతుల మీద దేహాన్ని కాపలా కాయాలి శరత్కాలపు మబ్బులు చంద్రకాంతిని తాగి తూగి నట్లు చీకటిని తాగి నిషాలో తూగవు కదా ! ఈ రాత్రి ఎవరో ఒకరు మేల్కొనే ఉండాలి వెన్నెముక రహదారి పై వెతుక్కుంటున్న రహస్య భాషా ప్రవాహంలో ఈదులాడాలి.
by Dabbikar Roop Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mCvK6A
Posted by Katta
by Dabbikar Roop Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mCvK6A
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి