నిశీధి |" కల "త | ఎండి డస్సిపోయిన భుమి పై పొడి జల్లుల ఓదార్పులా అలసిన కళ్ళ ని కొన్ని మృదువయిన కలలు తడిమితే బాగుండు కలవరం లేని సవ్వడితో కల వరమై కళ్ళని జో కొడితే ఇంకా బాగుండు జీవితంతం తోడు ఉండమన్నట్టు నిద్రకెందుకో అంత బెట్టు కొన్ని ..చాల కొన్ని క్షణాల ప్రేమను అలా ఒక్కసారి గుమ్మరించి పోవొచ్చుగా ప్రపంచాన్ని రాసియ్యమన్నానా ..ఏదో రెప్పల మీద మృదువుగా ఒక సంతకమేగా అడిగాను పెద్ద కోరికలేమి కోరాను ...మార్దవంగా చిన్నగా లాలిపాట తో జోకొట్టమనేగా . అయినా నాతో దోబుచులాడి ఎక్కడని ,ఎంతసేపని దాక్కుంటావులే అలకమాని ఏ రాత్రికొచ్చినా అప్యాయంగా కళ్ళకి హత్తుకుంటాననేగా ఇంతా ఆకతాయితనం .. హమ్మ్ సరెలే ఇలారా .. కాసేపు నిన్నలా గాఢంగా కళ్ళలో బంధించుకోని .. తృప్తిగా కాసేపు నీ కౌగిల్లో ఒదిగిపోని భయపు జ్వరపు పగళ్ళ నుండి దూరంగా నీలొ నేనుగా కొన్ని క్షణాలు కరిగిపోని . .. .. మరో ఉదయపు నిసృహ నన్ను నానుండి దూరం చేయకముందే నీలో కలిపేసుకోని జీవితపు ప్రవాహంలో తల్లడిల్లే మనసు పడవకి ఒకింత తీరం అవ్వోచ్చుగా నిశీ !! 10/06/14
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pz2kdi
Posted by Katta
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pz2kdi
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి