మనసు + మెదడు = ప్రేమ // సత్యం జి // ---------------------------------------------------------------- ఏంటే.. అంత పిచ్చిగా ప్రేమించావా నన్నూ..? బాబోయ్.. భారమైన గుండే లోతుల్లో పూర్తిగా నన్నే నింపేసినట్లున్నావ్ గా.. వామ్మో.. నీ ప్రేమ చూస్తుంటే నాకే ప్రేమిస్తానేమో, ప్రేమించానేమో అని డౌటుకొడుతోంది.. మళ్ళీ ఆ పెప్సోడెంట్ యాడ్లో "మీ టూత్ పేస్ట్లో ఉప్పుందా..?" అని అడగటానికి కాజల్ వొచ్చినట్టు ధడేల్మని నా మెదడు కాస్త బయటకొచ్చి నా ముందుకొచ్చి ఓరి పిచ్చోడా ఆ మనసుగాడి మాటలు వింటావేందిరా పిచ్చినాయాలా అంటూ తిట్టింతిట్టు తిట్టకుండా తిడుతుంటే నేనేమైనా తక్కువ తిన్నానా అని ఫీలయ్యాడనుకుంట నా మనసు గాడు.. ధూం సినిమాలో హీరోలాగా యమా రేంజ్ లో ఎంట్రీ ఇచ్చి వార్నీయంకమ్మా.. ఆ మెదడుగాడికి గుండెకాయ్ అనేది ఒకటి ఏడిస్తే కదా ప్రేమ గురించి తెలిసిచావటానికి.. కాబట్టి సక్కంగ నామాటిని ఆ ప్రేమని ప్రేమించు.. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించు అనుకుంటూ ఇద్దరూ శ్రీకృష్ణుడిల్లా ఫీలైపోయి నన్ను అర్జునుడ్ని చేసి పారేసి మరీ స్పీచ్లిచ్చేస్తున్నారు.. బాబోయ్ ఆపండ్రా నాయనా నన్ను సావగొట్టమాకండి.. ఏదో ఒకటి చేసుకుంటా నన్నొదిలెయ్యండ్రా బాబూ అంటే ఒక్కడూ మాటినడు.. ఆ మనసు గాడికి నువ్వంటే ఇష్టం.. ఈ మెదడు గాడికి నేనంటే ఇష్టం.. ఇద్దరూ కలిసి నా దుంప తెంపేస్తున్నారు.. ఇంత సీరియస్ లో మళ్ళీ ఇంతకీ ఏం దుంపా..? అని యదవ కొస్చెన్లెయ్యకు.. నాక్కాలుద్ది.. హా ఎక్కడున్నా.. ఆ మనసు గాడు మెదడు గాడు.. ఇద్దరు కొట్టేస్కుంటున్నారు.. ఇద్దర్లో ఎవడ్నీ కాదనలేం.. వాడు కావాలి వీడు కావాలి.. ఎవడికి సర్ది చెప్పగలం..? వాయ్యోయ్ అసలు సంగతే మర్చిపొయ్యాగా వీళ్ళగొదవలో పడి.. అసలు కావల్సింది వాడా వీడా అని కాదు కదా ఇక్కడ.., నువ్వు.. నువ్వు నాకు కావాలా ఒద్దా అన్నది కదా.. హహ్హహ్హా.. వేశా ఐడియా వేశా.. ఒరెయ్ మెదడూ ఇట్రారా.. ఒరెయ్ మనసుగా నువ్వు కూడా ఇట్రారరెయ్.. ఇదిగో ఇద్దరికి చెప్తున్నా సరిగ్గా వినండి.. 'నేను నాకు' కావాలి.. 'తను నాకు' కావాలి.. ఒరెయ్ మెదడుగా.. నేను నాకు కావాలంటే అసలు నేను ఎప్పుడో తనైపోయాను కదరా.. ఒరెయ్ మనసుగా.. తను నాకు కావాలంటే నేను అనే నేను నా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి కదరా.. కానొరెయ్ మీ ఇద్దరికీ ఒకటి చెప్పనా అది నాలోనే ఉందిరా.. తనెవరో కాదు నా ప్రాణం.. హమ్మయ్య ఈ యదవలిద్దరూ ఒక్కటైపోయారు.. ఇంక ఆల్ హ్యాపీస్.. ఒసెయ్ నా ప్రాణమా నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమలో ప్రేమగా నేను నీ ప్రేమనైపోయాను..! -సత్యం జి సామాన్యుడు కాదు, 10-06-2014, 01:53
by సత్యం జి సామాన్యుడు కాదు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uMUpvv
Posted by Katta
by సత్యం జి సామాన్యుడు కాదు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uMUpvv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి