పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Dabbikar Roop Kumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dabbikar Roop Kumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జూన్ 2014, మంగళవారం

Dabbikar Roop Kumar కవిత

డా.రూప్ కుమార్ డబ్బీకార్ // మార్మిక నదం -------------- దూరాన, సాగర తీరం పై అలల లెక్కలలో తన రెక్కల చప్పుళ్ళను మరిచిపోయి తీతువు పిట్ట మేల్కొనేవుంది ద్వారపాలకా ! మేలుకునే వున్నావా ?! చీకటినంతా నా గది లోకి వొంపి వెలుతురు ముసుగును కప్పుకొని మృత్యువుని స్వప్నిస్తున్నావా !! శరీర నగర ద్వారాలు ముసివేయబడుతున్నాయి అంతా సుషుప్తి లోకి జారుకుంటారు చీకటికి, పగలుకు తేడా లేదు ముళ్ళ తీగల మీద కదా నీ నడక అర చేతుల మీద దేహాన్ని కాపలా కాయాలి శరత్కాలపు మబ్బులు చంద్రకాంతిని తాగి తూగి నట్లు చీకటిని తాగి నిషాలో తూగవు కదా ! ఈ రాత్రి ఎవరో ఒకరు మేల్కొనే ఉండాలి వెన్నెముక రహదారి పై వెతుక్కుంటున్న రహస్య భాషా ప్రవాహంలో ఈదులాడాలి.

by Dabbikar Roop Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mCvK6A

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Dabbikar Roop Kumar కవిత

డా. రూప్ కుమార్ డబ్బీకార్ // శిశిర వనంలో ... ఎదురు చూసిన పలకరింపుల జాడ లేదు ఎల్లలు దాటి శిశిరం రానే వచ్చేసింది ఇల్లు ఒంటరితనం గడ్డిపరకలు మృత్యువు ఒడిలోకి చేరే సన్నివేశం చేరువైంది నాలో -- వర్షం మాత్రం కురవడం మానలేదు ! ***** తడి ఆరిన జ్ఞాపకాలు మనల్ని మరచినపుడు పలుచబడే జుట్టును గుర్తు చేయకు మరచిపోయిన వాటిని నేను లెక్క చేయను విషాదమేమిటంటే నీవు జీవితాన్నే మరిచావు !

by Dabbikar Roop Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mrh1LA

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Dabbikar Roop Kumar కవిత

డా . రూప్ కుమార్ డబ్బీకార్ // శిశిర వనంలో ... చూరుకు వేళ్ళాడే వాన చినుకుల్ని నాలుక ఒడిసి పడుతోంది ఈ వయసుకు అసలు సిగ్గు లేదు సాయంకాలపు మంచులో తడిసి శిశిర దేహం పై ఏ వసంతాలను మొలకెత్తించాలనో!

by Dabbikar Roop Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rVJmlx

Posted by Katta