కలల సారధ్యంలో -------- =============== కలల్ను గూర్చి సమగ్రంగా ఓ కవితను రాయాలన్న తపన నా గుండెలో గూడు కట్టుకుని కరుడుగట్టుకుని పోయిందనుకుంటా క్షణ క్షణమూ ముల్లుగా గుచ్చి బాధపెడుతూ ఉంటుంది. రాత్రి వచ్చిన కలే తెల్లవారుతూనే మంచులా కరిగి నీరయి మనోఫలకం మీదనుంచి చెరిగిపోతూ వుంటే గతకాలంలో శరపరంపరగా వచ్చిన కలలు కవితకో సం కాగితం మీదకు ఎలా తేవాలన్నదే తీరని సమస్య తీరా అదే దొరకని పరిష్కారం. కలంటే ఒక కళాఖండం కాదుకదా కలకాలం మనో ఫలకంపై చెరగని ముద్రవేసి చిరకాలం స్మృతిపధంలో చెదరకుండా మిగలడానికి. కలంటే అపురూపమైన, అద్భుతమైన తైలవర్ణ చిత్రమూ కాదాయె చాయా చిత్రంగా వెన్వెంటనే తీసి భద్రపరచి తరువాత తీరిగ్గా వర్ణించవచ్చుననుకోడానికి. కలంటే కాలానికనుగుణంగా నేతలు చేసే నీటిమీద మూటలాంటి వాగ్దానం. ఎప్పుడు క్షుణ్ణంగా కరిగిపోతుందో ఎవ్వరికెరుక ? అందుకే కలంటే కల్లగానే మనం స్వీకరించాలి బుద్బుద ప్రాయమూ కేవలం క్షణభంగురమనీ మనం గుర్తెరుగాలి. కవితకు ప్రాతిపదికగా కలల నేపధ్యాన్ని ఎంచుకో వడం మానాలి. కలికాలంలో కరిగి నీరయి రూప రహితమై నిలిచే కలలకన్నా మరో మంచి ఇతివృత్తాన్ని ఎంచుకో మని ఉచిత సలహా పారేసి చిత్తగించి సెలవుతీసుకున్నాను. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLLxhb
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLLxhb
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి