KK // ఇదిగో బెదరూ!!! నీ తెలుగు తెలుసుకో// ============================== ఈ మద్య తెలుగు సినిమాలలో, టీవీ సీరియళ్లలో .... ముఖ్యంగా యాంకరింగులో వాడే కొన్ని తెలుగు పదాల విశ్లేషణ... క్లుప్తంగా... ఎవ్వరు పుట్టించకపోతే అసలు మాటలెలా పుడతాయి, వేసుకో వీడికి రెండు.... అన్న చందాన కొన్ని మాటలు అలా పుట్టేస్తుంటాయి, అంతే. వాటి పుట్టు పూర్వత్రాలు పక్కనబెడితే... మీ అసలు ప్రశ్నకి సమాధానంలోకి వెళదాం. 1. తొక్క:- సహజంగా వొలిచి పారేసేదాన్ని తొక్క అంటారు, ఇక్కడ సదరు వ్యక్తికి రుచించని/నచ్చని ప్రతీ విషయం గురించి తొక్క అనే పదం ఉపయోగిస్తారు. 2. తొక్కలోది:- తొక్కలోనిది పండో లేక కాయో ఒలిచేవరకూ తెలియదు ఎవ్వరికైనా... అలాగే సందిగ్ధంలో సదరు వ్యక్తి ఉంటే వారు తొక్కలోది అనే పదప్రయోగం చేస్తారు. 3. పీకావులే:- కలుపు పీకితేనే పంట ఏపుగా పెరుగుతుంది అన్న సత్యం నుంచి ... పరిస్థిని మన అదుపులోకి తెచ్చుకుంటే పీకాడని, లేదంటే ఏమీ పీకలేకపోయాడని ప్రయోగం జరుగుతుంటుంది. 4.బొంగు:- వెదురు బొంగు పైకి దృఢంగా కనపడినా లోపలంతా డొల్లే అనేది ఇక్కడ అర్ధం.... పైకి తెలిసినట్టు కనపడి తర్వాత నిర్ఘాంతపోయే సందర్భంలో ఈ ప్రయోగం జరపబడుతుంటుంది. 5.అదుర్సు:- సహజంగా కంపించేది విపరీత పరిణామాలు లేదా ఊహించని మార్పులు జరిగినప్పుడే... అలాంటి సందర్భంలో ఈ ప్రయోగం. 6.చింపావులే:- తప్పురాస్తే కాగితాన్ని చింపేస్తాంగా... నువ్వు తప్పు చేసావోచ్ అని చెప్పడానికి ఈ ప్రయోగం. 7.ఇరగదీసావ్:- పొయ్యిలో పెట్టే కట్టెల్ని చిన్నవిగా/అనువుగా చెయ్యడానికి విరిపినట్లే... విషయాన్ని అతి సునాయాసంగా ఎదుటివాడికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ఈ ప్రయోగం చెయ్యవచ్చు. చివరగా నేను ఇరగదీసాను అని మీరు ఈ సందర్భంగా అనవచ్చు. తెలుగు దేదీప్యమానంగా వెలుగుతోంది. అందరికీ జేజేలు. మీరు ఇద్దామనుకున్న పుణ్యం మొత్తం ఇచ్చేయ్యండి సార్ (కొరియర్ చేసినా/ ఆన్లైన్ ట్రాంజాక్షన్ చేసినా అంతా మీ ఇష్టం. ======================================================== Date: 13/05/2014
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn4Cf2
Posted by Katta
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn4Cf2
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి