మోతి మోహనరంగా/అమ్మకు అక్కకు వద్దు వీళ్ళు వాళ్ళే.. ........................................................... బయిట ఆశగా ఎదురు చూస్తున్న అమ్మకు ,ఆడపిల్లని తెలియగానే భూకంపం అయి0ది. పెద్దమ్మ చేతిలో ను0చి తీసుకోకు0డా ,మొహన్ని పొద్దెకి0చుకొని గోడకానుకొని అటు పడేయమంది అప్పుడు మృగరాజు గర్జన బయిలుదేరి0ది నాలో.... గోనె సంచిలా0టి దా0ట్లో అక్కను ఆపరేషన్ థియేటర్ ను0చి శవంలా తీసుకొస్తు0టే ,అక్క కను రెప్పలపై ఆడా మగా అనే సందేహత్మక భయం..... అక్క కళ్ళు తెరవగానే నాన్న కళ్ళ ము0దు.....ఆడపిల్లని అక్క కార్చిన కన్నీళ్ళు జుగుప్స కలిగి0చి.... ఆకాశం చీల్చుకొని ఎక్కడో పడిపోయాను నేను. ఎక్కడ చంపేస్తారోనని ,ఆ రాత్రి కాపలా కాసిన నాకు... వివక్షతను పోగొట్టే యంత్రాన్ని కనిపెట్టి ఆకాశంలో వేలాడదీసి కనిపెట్టుకు0టు ఉ0డేలా..... ఆడది పుడితే ఎవడు చంపినా చావకూడని ఇ0జక్షన్ కనిపెట్టాలని ఇలా ఎన్నో...... చూశాను నేను ఇద్దరు పుట్టాక మూడోది మగాడు కాకపోయే సరికి బడి ను0చి వచ్చేసరికి చంపబడిన చిన్నారిని. అప్పుడు నన్ను నేనే కొట్టుకున్న గాయాలి0కా మానలేదు చిన్నప్పటి ను0చి చూస్తున్నా ఆడదాన్ని మూడు ముళ్ళ కంచలో బంది0చి చేస్తున్న వద. అత్తలు వాళ్ళను వంటగదిలో పొయిగా కాల్చడం ఇల్లు అనే నాటకశాలలో స్త్రీ హి0స ప్రదర్శి0పబడటం. అమ్మకు అక్కకు వద్దు ఆడపిల్ల నాకిది చెది0చిలేని సూత్రం..? అ0దుకే నేన్నిప్పుడు పిలునిస్తున్నా తూటాగా పుట్టమని బాణంగా పుట్టమని యాసిడాగా పుట్టమని..... 14-05-2014
by Mothi Mohanaranga
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jqF1fH
Posted by Katta
by Mothi Mohanaranga
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jqF1fH
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి