పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మే 2014, బుధవారం

Kanneganti Venkatiah కవిత

వొరిగిందేమిటి...పిచుక .....కన్నెగంటి వెంకటయ్య. పిచుకల జంట వగచింది పొదిగే గుడ్డును తడుముకొని పీచు పొత్తిళ్ళగూటిలొ ఒదిగి ఎదిగే బిడ్డను తలచుకొని //పిచుక// పురుగో బూసో పొట్టపోసుకొని హాయిగ జీవిస్తున్న పిట్టలు తల్లడిల్లినవి రేడియేషనుల బాధను చెప్పుకొని. .//పిచుక// కన్నవాళ్ళను ఆదరించని ప్రకృతినీ ప్రేమించనోళ్ళకు దూరం పోయి బ్రతుకుచున్నవి చెట్లను నమ్ముకొని .//పిచుక// రోజుకో జీవి కనుమరుగవుతూ భూమి ఎడారిగ మారితే ఇగిరి పోతాడు మనిషి కూడ తను గురుతును చెరుపుకొని .//పిచుక// జీవవైవిద్య సభలను జరిపితే వొరిగిందేమిటి కన్నెగంటి ప్రాణి రక్షణకు నడుం బిగించు కండ్లను నులుముకొని .//పిచుక//

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOloDB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి