ఒకే ఉదయం రెండు చోట్లా!!!//శ్రీనివాస్//31/05/2014 ------------------------------------------------------- వాన కురిసి వెలిసినట్టుంది రహదారుల నిండా పారుతున్న నీళ్ళు వలసపోతున్న కాగితపు పడవలు బాట కిరుపక్కల మేట వేసిన బురద బురదలో చిందులు వేస్తూ కాగితపు పడవలు నీళ్ళల్లో జారవిడుస్తూ హరివిల్లును కంట్లో కట్టేసుకుంటూ లేత యెండ చురుకు నాస్వాదిస్తూ కొత్త కాలపు వెలుగులు మనసును తడిపెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ వాడొక్కడే !!! వాడొక్కడే!! వాడొక్కడే!! కాలం పోకడ తెలియని వాడొక్కడే!!! యేదొచ్చినా,యేది పోయినా నవ్వేసే వాడొక్కడే యేడవటం రాని వాడొక్కడే చిరుగు పాతల నొదిలేసి చిరునవ్వులను తొడిగేసుకుంటూ చిరకాలపు సంకెళ్ళను వదిలించుకున్న ఆనందాన్ని తనివి తీరా అనుభవించేస్తాడు ఆ చిన్నోడే ముసిరిన చీకట్లను విడిపించుకోని ఒకే ఉదయాన్ని రెండు చోట్లా చూస్తాడు
by Maddali Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tZbHFf
Posted by Katta
by Maddali Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tZbHFf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి