పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మే 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||సంధ్య చిగురు|| సులభంగా సౌక్యంగా ఉండేందుకు మనని మనం చెరిపిరాసుకొనేలానే రాసుకొంటాం ఎప్పుడో అప్పుడు పొగడ్తలోనో ..పదవిలోనో పడిపోవక తప్పదు అప్పుడు భారం కోల్పోయి ..మళ్ళీ కొత్తగా మొదలవుతుంటాం నిత్యం లోపల పర్వతాలను ఎక్కేవాళ్ళమేకదా ... ఎప్పుడో అప్పుడు జారిపడతాం.. అప్పుడు మాత్రం.... . గతంలో రాసుకొన్నది చెరిగిపోకుండా చేతలతో అడ్డుకొంటాం ..... ఎటుతిరిగి మనమో సున్నా గీస్తాం ....కాకుంటే ఙానం పెరిగాక అదే సున్నాని మరికాస్త గుండ్రంగా గీస్తాం మహా అయుతే మనమో సుడిగాలి అవుతాం ...సన్నని వాన చినుకులవుతాం తెల్లని మల్లెమొగ్గలవుతాం .... అన్నీ ఉన్నవే ...అన్నీ నిన్నవే లక్షల ఖాళీ క్షణాలమధ్య ఒక్కటి మెరవగానే .... మనల్ని మనం గబగబా చెరిపి తిరిగి రాసుకొంటాం క్షణంలోనే లక్షసార్లు .....మొదలవడం నచ్చక మళ్ళీ మొదలవుతుంటాం చెరిపిన అక్షరాల పొడి మొహం మీద పడి మెరుస్తూ .... ముంగురుల నీడలో తడుస్తూ ....వచ్చిన సందు దొరకగానే కాసేపు సంధ్య చిగురులై ఊరించి చాటుకు వెళ్ళిపోతాం ........

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wGmrKR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి