మను @ నిద్రలేని రాత్రి @ గాడంగా నిద్రపోతున్న నన్ను ఓ భయంకరమైన కల తట్టి లేపింది ఏవో పెద్ద అరుపులు కేకలు అక్కడ ఉన్న చెట్ల పొదలన్నీ విరుగుతున్నట్టు శబ్దాలు కింద చుస్తే ఎవరినో ఈడ్చుకేల్లిన ఆనవాళ్ళు దారి నిండా రక్తపు తిలకం నా బుద్ధి అర్థం చేస్కోటం మొదలు పెట్టింది అవి కేకలు కాదు ఆర్తనాదాలు అని ఇవన్నీ చూస్తున్న అక్కడి మనుషులు కాళ్ళకు లేపనం పూసుకున్నట్లుగా మాయమవుతున్నారు బహుశా వాళ్ళు కులం అనే లేపనం పూసుకున్నారనుకుంటా వాళ్ళు మానవత్వం మరచిపోయి చాలా యుగాలు గడిచిందనుకుంటా వాల్లను మనుషులని పిలవడానికి కూడా నాకు సిగ్గేసింది మూల్గుల శబ్దం పెరిగే కొద్ది కాళ్ళ వడిని పెంచా ఇంతలో నాకో పెద్ద విచిత్రం కనిపించింది చెట్లకు పువ్వులు ఆకులతో పాటు మనుషులు కూడా కాసివున్నాయి కళ్ళు బైర్లు కమ్ముతుండగా నా మెదడు చెప్పింది నేను చూసింది చెట్లకు కాసిన మనుషుల్ని కాదని మనుషుల్లో పుట్టిన మృగాలు ఆడిన వికృత క్రీడ అని కింద పడిన అద్దంలా ముక్కలైంది నా నిద్ర కళ్ళు తెరిస్తే సమాజం ఇంకా నిద్రపోతూనే కనిపించింది 30-05-14
by Katika Manohar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mVvdQ8
Posted by Katta
by Katika Manohar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mVvdQ8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి