పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మే 2014, శనివారం

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || రాక || నువు ఎందుకో ఇక్కడికి వస్తావు వచ్చేసరికే ఇక్కడొక ఉత్సవం కొనసాగుతూవుంటుంది నువ్వు ఎవరో, నీచుట్టూ జరుగుతున్నది ఏమిటో నీకు నువ్వుగా తేల్చుకోకముందే వాళ్ళంటారు 'నువ్వు ఫలానా, ఇది చెయ్యాలి, అది కూడదు ' అని ఈ ఉత్సవానికి అర్థమేమిటని అడగబోతావు 'అదేమిటి కొత్తగా అడుగుతున్నా' వంటారు కొందరు జాలిదలచి 'నిరాశ కూడ' దని ఓదార్చుతారు వారికి నచ్చినట్టు ఉండబోతావు కాని భయ, హింసాపూరితమైన ఉత్సవంలో ఏదో వెలితి వుందని తెలుస్తూనే వుంటుంది ఉత్సవాన్ని విడిచి ఏకాంతమైదానం చేరి నీ జవాబు నీలోనే వుందని నమ్మి అడుగుతావు 'ఇదంతా ఏమిటి’ అని మరింత విశాలమౌతున్న ఆకాశం క్రింద దృశ్యాలన్నీ అణగిపోయిన విశ్రాంతిలో ఉండిపోతావు రాకపోకలు లేని నీలో కరిగిపోతావు 31.5.2014 http://ift.tt/1pGhKvQ

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pGhKvQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి